"వాస్తు" ఈమద్య కాలంలో బాగవినిపించే పేరు ! "వాస్తు" అంటే మోజు, పిచ్చి ,లేదా నమ్మకం మరే దైన కావచ్చు, అది మంచిదే కాని చాలామంది ఇంటిని 100 కి 99% వాస్తు చూపించి కడుతున్నారు. అలా అని మనం మన ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించు కుంటున్నామా, లేదా అలా వాస్తు ప్రకారం నిర్మించ లేక పోతే ఆ తప్పు ఎవరిది వాస్తు నిపుణులదా ! లేదా గృహ యజ మనిదా! కచ్చితంగా ఇద్దరిది అని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తునిపుణులు గృహయజమానికే అనుకూలంగా వాస్తు "చేప్పడ మే" ఒక వాస్తు నిపుణుడు గృహ యజమానికి అనుకూలంగా ఎప్పుడైతే వాస్తు చేబుతాడో ఆ ఇల్లు వాస్తుకు విరుద్దంగా తయారవుతుంది. కాని వాస్తుకు బలంగా కాదు. "అక్కడ కాంప్రమైజ్ అన్నది కోంపముంచే "విధంగా తయారవుతుంది. ఎప్పుడైతే వాస్తునిపుణులు కాంప్రమైజ్ అవుతాడో అప్పుడు నష్టపోయేది గృహయజమానే కాని వాస్తునిపుణులు కాదు . ఇది గృహయజమాని గమనించాలి. రెండవది గృహ యజమాని ఎవరైతే ఇల్లు నిర్మిస్తున్నాడో ఆ వ్యక్తి ప్లాన్ వేపించు కోవడంలోనే పొరపాటు అనవచ్చు. లేద డబ్బు పోతుంది అనే ఉద్ధేశంతో కావచ్చు. వాస్తునిపుణులు ప్లాట్ పరిశీలన చేసిన తర్వాత ప్లాన్
వేపించుకోవడం మంచిది. అలా కాకుండా మనప్లాటు దగ్గరకు వస్తే ఎక్కువ అమౌంటు(ఫీజు) ఇవ్వాలి కదా అక్కడికే మనం వెలితే ఎంతో కొంత మనకు తోచినంత ఇవ్వచ్చు కదా అని అలా అనుకుంటే నష్టపోయోది మీరే ఎందుకంటే మీరు లక్షలు, కోట్లు పెట్టి ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు వాస్తు కు ఫీజు గురించి ఆలోచించకూడదు. ఒక వాస్తునిపుణుడు ప్లాన్ ఇస్తే మీ ప్లాటు వద్దకు రావాలి ప్లాటు ఎన్ని డిగ్రీస్ లో ఉంది ఎన్ని డిగ్రీస్ లో ఉంటే ఎలా నిర్మించాలి పరిసర వాస్తు ఎలా ఉంది వీధిచూపులు, వీధి పోట్లు ఎమైన ఉన్నాయా వీధిచూపులు కాని వీధి పోట్లు గాని ఉంటే వాస్తుకు అనుగునంగా ఎలా నిర్మించాలి ఎలా నిర్మిస్తే ఆగృహం లో మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయాలను మీకు తెలియచేయాలి. అలా తెలియజేసి మీ ప్లాటుకు తగిన విధంగా మీకు డబల్ బెడ్రూమ లేదా సింగిల్ బెడ్రూమ డైనింగ్ కిచెన్ మరియు హాల్ మెదలగు విషయాలు మీతో సంప్రదించి ప్లాన్ ఇవ్వాలి. అలాగే ఒకటి లేద రెండు అంతకంటే ఎక్కువ సార్లు మీ ఇంటిని విజిట్ చేయాలి. అప్పుడే మీఇల్లు వాస్తు అనుగునంగా తయారవుతుంది. అంతేకాని మీరు వెళ్ళి ప్లాన్ వేయించి తెచ్చుకోవడం గృహనిర్మాణం చేయడం మళ్ళి వారికి ఫోన్ కాని, పిలిపించుకొని చూపించకుండా గృహ నిర్మాణాలు చేసుకొని మా ఇల్లు వాస్తు ప్రకారం ఉందనుకుంటే పొరపాటే కొన్ని చోట్ల చాలా గోరం అక్కడ ఇల్లు నిర్మాణమే పనికిరాదు అలాంటి చోట కూడ గృహాలు నిర్మించు కుంటున్నారు. మీరు వాస్తునిపుణులకు చూపించా రా అని అడిగితే వాస్తు వాళ్ళ తోనే ప్లాన్ వేయించి మని చెబుతున్నారు వాస్తు వాళ్ళు ఇక్కడి వచ్చి ప్లాటు చూసి ప్లాన్ ఇచ్చారా అంటె లెదండి మేమె వెళ్ళి ప్లాటు కొలతలు చేప్పాము ప్లాన్ ఇచ్చారండి అటుంన్నారు అది వాస్తు. అలాగే మీ ఫీజును బట్టి ప్లాన్ ఇస్తారు మీరు ఇచ్చే తక్కువ ఫీజు తో మీ వద్దకు వచ్చి ప్లాన్ ఇవ్. కాని మన పిల్లలు బాగా చద వాలన్నా మంచి ఉద్యోగం, వ్వాపా రంలో ముందుకు వెళ్ళాలన్నా మన గృహం యొక్కవాస్తు బలం మీద ఆధారపడి ఉంటుందని గమనించాలి మనం మన ఇంటిలోని వారంతా బాగుండా లను కోవడం కూడ అంతే ముఖ్యం. మన ఇల్లు వాస్తుకు బలంగా ఉంటే మన ఇంటిలోని వారంతా తరతరాలు బాగుంటారని కచ్ఛితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ప్రయా నించే బండి కాని, కారు కాని, బస్సు కాని, ప్లైట్ కాని, బాగా సౌకర్యవంతంగా వుంటె మన ప్రయాణం సుఖంగా ఉంటుంది. అలాగే మనం నివసించే గృహం వాస్తుకు బలంగా ఉంటే మన జీవిత ప్రయాణం కూడా అంతే సుఖవంతంగా ఉంటుంది. అలాగే పక్కవారి ఎలివేషన్ కంటే మా ఎలివేషన్ బాగుండాలి, వారి కలర్స్ కంటే మా కలర్స్ బాగుండాలి, పక్కవారి గృహం కంటే మా గృహమే అందంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే పక్కవారి గృహం కంటే మాగృ హం కూడా "వాస్తు"కు బలంగా ఉండాలని కూడా కోరుకోండి. ఇది మా ఉద్దేశం.
ఎందుకు ఇదంతా చెప్పవలసి వస్తుందంటే మేము వాస్తు ప్లాన్స్ ఎన్ని కొత్త గృహాలకు ఇస్తున్నా మో అంతకంటే ఎక్కువగా పాతగృహల మార్పు లకై వెళ్ళవలసి వస్తుంది, ఎందుకలా అని ఆలోచిస్తే పై కారణాలే, ప్రతి గృహానికి మార్పు లకై లక్ష రూపాయల నుండి ఐదు, పది లక్షల, వరకు పాత గృహ మార్పులకు అయితే ఎంత ఇబ్బంది కరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ గృహం వలన మనం అభివృద్దిలో ఎంత వెనక్కి వెళ్ళి ఉంటుంది, ఆలోచించండి. ఎన్నో కష్టాలను, మరెన్నో నష్టాలను, మరెన్నో రోగాలను అనుభవించి వాస్తు కారణంగా ఇదంతా జరిగిందని ఎవరైనా చెబితే ఆరోజు మళ్ళి వాస్తు మార్పులకు వాస్తు నిపుణులను సంప్రదించి అనుగుణంగా మార్చడానికి మళ్ళి ఖర్చు అప్పటికే మనం ఇబ్బందు లో ఉండి మళ్ళి మార్పు లకని ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టం ఆ బాధ అనుభవించిన వాడికి చూసిన మాకు మాత్రమే తెలుస్తుంది. వాస్తు మార్పులు చేయలేక అమ్ము కొన్న వాళ్ళు చాలమంది ఉన్నారు. తక్కువ ఫీజు తీసుకొని బాగా వాస్తు చెప్పేవాళ్ళు యు న్నారు.ఎక్కువ ఫీజు తీసుకుని వాస్తుచెప్పేవాళ్ళుయున్నారూ.సరైన వాస్తు నిపుణులను ఎంచుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ఎవరైన గృహం నిర్మాణం చేసేటప్పుడు జాగ్రతపడ మని మాత్రమే మా సలహా. "గృహమే కదా స్వర్గసీమ అన్నారు మన పెద్దలు" "సర్వేజనా సుఖినోభవంతు"
కొత్త ఇల్లు కట్టా లన్న, పాత ఇల్లు వాస్తు ప్రకారం మార్పులు చేయా లన్న వాస్తు సలహాలకోసం సంప్రదించండి.....
KL.RRAM "వాస్తు నిపుణులు
7993670455
8019300515
వాస్తు శాస్త్రము
~~~~~~~~
పురోగతిని సాధించడానికి ముఖ్యమైన వాస్తు చిట్కాలు, వాస్తు నియమాలు మరియు వాస్తు మార్గదర్శకాలు.........!!
1. అథర్వణ వేదం ప్రకారం, ప్రాంగణంలోని 8 దిశలు మరియు 1 కేంద్రం పై క్రింద పేర్కొన్న విధంగా 9 దేవతలు మరియు 9 గ్రహాలు ఆధిపత్యం వహిస్తారు
a. ఉత్తర దిశ పై కుబేరుడు (ఐశ్వర్యం యొక్క అధిపతి) మరియు గురు గ్రహం ఆధిపత్యం వహిస్తారు.
b. దక్షిణ దిశ పై యముడు (మరణానికి అధిపతి) మరియు అంగారక గ్రహం ఆధిపత్యం వహిస్తారు.
c. తూర్పు దిశ పై ఇంద్రుడు (దేవతల రాజు) మరియు శుక్ర గ్రహం ఆధిపత్యం వహిస్తారు.
d. పశ్చిమ దిశ పై వరుణ దేవుడు (నీటికి అధిపతి) మరియు శని గ్రహం ఆధిపత్యం వహిస్తారు.
e. ఈశాన్య దిశ పై శివుడు మరియు బుధ గ్రహం ఆధిపత్యం వహిస్తారు.
f. ఆగ్నేయ దిశ పై అగ్ని దేవుడు మరియు చంద్రుడు ఆధిపత్యం వహిస్తారు.
g. వాయువ్య దిశ పై వాయు దేవుడు మరియు కేతు గ్రహం ఆధిపత్యం వహిస్తారు.
h. నైరుతి దిశ పై నిరు తి ,మరియు రాహు గ్రహం ఆధిపత్యం వహిస్తారు.
i. ప్రాంగణం యొక్క కేంద్ర ప్రాంతం పై బ్రహ్మ దేవుడు (విశ్వం యొక్క సృష్టికర్త) మరియు సూర్యుడు ఆధిపత్యం వహిస్తారు.
2. అథర్వణ వేదం ప్రకారం, మీ ప్రాంగణంలోని 8 దిశలను క్రింద తెలిపిన ప్రకారం ఉపయోగించాలి:
a. ఉత్తరాన్ని ట్రెజరీగా, స్టడీ రూమ్ గా, పిల్లలగదిగా, బేస్ మెంట్‌గా ఉపయోగించాలి (కానీ బేస్ మెంట్ లో నివాసం వుండకూడదు).
b. ఈశాన్యం ను ప్రధాన ప్రవేశ ద్వారం, ప్రార్థన గది, స్విమ్మింగ్ పూల్, పచ్చిక బయళ్ళు, ఉద్యానవనం, చిన్న మొక్కలు, ఖాళీ స్థలాలు, నడక మార్గాలు మొద లైనవిగా ఉపయోగించాలి. ఈ స్థలంలో గోడలు దక్షిణ, పశ్చిమ మరియు నైరుతి గోడల కంటే 21 అంగుళాలు తక్కువగా ఉండాలి.
c. ప్రార్థన గది, స్టడీ రూమ్, డ్రింకింగ్ వాటర్ సంప్, ఖాళీ స్థలాలు, నడక మార్గాలు మొదలైనవి గా తూర్పు
ను ఉపయోగించాలి.
d. ఆగ్నేయం ను కిచెన్, జిమ్, ఫిట్‌నెస్ సెంటర్, ఇన్వర్టర్, జనరేటర్ మరియు మోటర్ రూమ్ గా ఉపయోగించాలి.
e. పడక గది, పెద్ద చెట్లకు స్థలం, బలమైన మరియు ఎత్తైన గోడలు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, లిఫ్టులు మొదలైన వాటి కోసందక్షిణాన్ని ఉపయోగించాలి.
f. నైరుతి భాగాన్ని పడకగది, పెద్ద చెట్లు, బలమైన మరియు ఎత్తైన గోడలు, మెట్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, వాహనాల పార్కింగ్ గా ఉపయోగించాలి.
g. పశ్చిమాన్ని టాయి లెట్‌లుగా, పశ్చిమంలో ఉత్తరం వైపు సెప్టిక్ టట్యాంక్ లుగా ఉపయోగించాలి. లిఫ్టులు, మెట్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు వంటివి పశ్చిమంలో దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవచ్చు.
h. వాయువ్య ప్రదేశంలో అవివాహితులు మరియు వృద్ధుల గదులు, ఆహార నిల్వ గదులు, బెడ్ రూమ్‌లు గా ఉపయోగించాలి.
i. ఖచ్చితమైన సెంటర్ భాగాన్ని గోడలు, దూలాలు మొదలైనవి లేకుండా ఖాళీ స్థలంగా వదిలివేయాలి.
3. మీ తల నిద్రించే సమయంలో దక్షిణం మరియు తూర్పు వైపు చూపే విధంగా మంచం ఉంచండి. పశ్చిమాన్ని నివారించండి మరియు ఉత్తరాన్ని ఖచ్చితంగా నివారించండి. దక్షిణం వైపు తల పెట్టడం వల్ల ఆదాయాలు పెరుగుతాయి. కాబట్టి, ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ దిశ ఉత్తమం. పడుకునేటప్పుడు తూర్పు దిశలో తల ఉంచడం వల్ల మేధస్సు పెరుగుతుంది. కాబట్టి, ఈ దిశ విద్యార్థులకు ఉత్తమమైనది. పశ్చిమ దిశలో తల ఉంచడం ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఈ దిశ పెద్దలకు మరియు సంపాదించే సభ్యులకు తగినది కాదు. ఉత్తరం వైపు తల ఉంచడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ ఉత్తర దిశను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నివారించాలి.
4. ఇంటిని నిర్మించడానికి ఉపయోగించే ప్లాట్ చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉందని నిర్ధారించుకోండి.
5. వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలి. తూర్పు ముఖంగా స్టవ్ వెలిగించి, ఇంట్లోని స్త్రీలు తూర్పు ముఖంగా వంట చేస్తే, డబ్బు స్థిరంగా ఇంటిలోకి ప్రవహిస్తుంది. డబ్బు కొరత ఎన్నడూ తలెత్తదు.
6. పశ్చిమం మరియు దక్షిణం వైపు ఉన్న వాటి కంటే తూర్పు మరియు ఉత్తరం వైపు ఉన్న కిటికీల సంఖ్య ఎక్కువగా ఉండాలి.
7. ప్లాట్‌కు తూర్పు మరియు ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం (ఇది కాంపౌండ్ వాల్ తో కూడిన స్వతంత్ర ఇల్లు అయితే) ఉండాలి.
8. పడక గదులను ఇంటి పశ్చిమం లేదా నైరుతి భాగానికి పెట్టాలి.
9. మీ పూజా గదిని ఇంటికి ఈశాన్య భాగంలో ఉంచండి.
10. నీరు (పైప్ లైన్ లు) దక్షిణం నుండి ఉత్తరానికి లేదా పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహించేలా చేయండి.
11. ఉత్తరాన బీరువాలు, లాకర్ లు మరియు నగదు పెట్టె లను ఉంచండి.
12. మీ పిల్లలు మీ ఇంటిలోని ఉత్తరం మరియు తూర్పు వైపు వారి బెడ్‌రూమ్‌లను కలిగి ఉండనివ్వండి.
13. ఇంటి మధ్యలో అంటే బ్రహ్మ స్థానం లో ఖాళీ ప్రదేశాన్ని ఉంచడం మంచిది.
14. ప్రవేశం మరియు పూజ గది నార్త్ ఈస్ట్ జోన్ లో అంటే ఇంటికి ఈశాన్య భాగంలో ఉండాలి
15. ఈశాన్యం నుండి ప్రవేశం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.
16. బాత్రూమ్ లు ఈశాన్యం మరియు నైరుతి ప్రదేశాలలో వుండకూడదు.
17. వంటగది ఖచ్చితంగా ఆగ్నేయ మూలలో ఉండాలి.
18. ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా వంట చేయాలి.
19. పడక గదులు దక్షిణం వైపు ఉండాలి
20. సంపాదనాపరుడైన ఇంటి యజమాని యొక్క పడకగది వాయువ్య భాగంలో ఉండాలి.
21. నైరుతి మూలలో పడకగదిని ఇంటి పెద్ద (తల్లిదండ్రులు) ఉపయోగించాలి.
22. పడకగదిని దక్షిణ మరియు పడమర వైపు కుమారులు మరియు వాయువ్య మూలలో కుమార్తెలు ఉపయోగించాలి.
23. ఇంటికి తలుపులు సరి సంఖ్యలో ఉండాలి. అదేవిధంగా కిటికీలు కూడా సరి సంఖ్యలోనే ఉండాలి.
24. పూజ గది తలుపుకు డబుల్ షట్టర్లు (రెండు తలుపులు) ఉండటం ఉత్తమం.
25. పూజ గదిలోని దేవతామూర్తులు పశ్చిమ తూర్పు మరియు ఉత్తరం వైపు చూడాలి.
26. సానుకూల శక్తులు లోపలకి వచ్చేలా అన్ని తలుపులు లోపల వైపుకి తెరుచు కునేలా ఏర్పాటు చేయాలి.
27. వంటగది టాయిలెట్ కు ముందు లేదా పక్కన ఉండకూడదు.
28. టాయిలెట్ తలుపు వంటగది లేదా డైనింగ్ హాల్ వైపు ఉండకూడదు
29. మరుగుదొడ్డిని ఉత్తరం వైపుగా చూస్తూ ఉపయోగించాలి. కానీ తూర్పు లేదా పడమర వైపు చూసేలా ఏర్పాటు చేయకూడదు.
30. ఉత్తరం లేదా దక్షిణం వైపు చూస్తూ వంట చేయడం వాస్తు శాస్త్రంలో పూర్తిగా నిషేధించబడింది.
31. తూర్పు మరియు ఉత్తర ప్రాంతాలలో బెడ్రూములు ఏర్పాటు చేయడం మంచిది కాదు.
32. ఆగ్నేయ మూలలో పడకగది ప్రమాదాలను కలిగించవచ్చు.
33. బెడ్, డైనింగ్ టేబుల్ లేదా సోఫా లను ఏదైనా బీమ్ లేదా అటక కింద వచ్చేలా ఏర్పాటు చేయకూడదు.
34. ఉత్తరం దిక్కు ను చూస్తూ భోజనం చేయకూడదు.
35. పెద్దలు మరియు పూర్వీకుల ఫోటోలు ఇంటి యొక్క నైరుతి మూలలో పెట్టాలి.
36. ఇంటిలోని ఇతర తలుపులు ప్రధాన ద్వారం కంటే పెద్దవిగా ఉండకూడదు.
37. ఇంటిలో మూడు తలుపులు ఒకే వరుసలో ఉండటం మంచిది కాదు.
38. పూజ గది పైన టాయిలెట్ లేదా వంటగది ఉండకూడదు.
39. పూజ గదిలో దేవతామూర్తులు ఎప్పుడూ దక్షిణం వైపు చూడకూడదు.
40. ఇంటిలో పూజ చేస్తున్నప్పుడు దక్షిణం దిక్కును చూడకూడదు. తూర్పు ముఖంగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, పశ్చిమం వైపు ముఖంగా ధన లాభం లభిస్తుంది, ఉత్తరాభిముఖంగా ఉండటం వల్ల సమాజం లో మంచి ఆదరణ లభిస్తుంది.
41. ఉదయపు సూర్యకాంతి పడేలా ఉత్తర/తూర్పు వైపున చిన్న మొక్కలను నాటండి.
42. ఇంటికి నైరుతిలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి.
43. పూజా స్థలంలో దేవతామూర్తుల పరిమాణం 10 ఇంచీలు కంటే ఎక్కువ ఉండకూడదు.
44. మెరుగైన ఏకాగ్రత కోసం స్టడీ టేబుల్ దగ్గర గోడ గడియారాన్ని ఉంచండి.
45. పడక గదిలో మంచం ముందు అద్దం పెట్టకూడదు.
46. గర్భిణీ స్త్రీలు ఇంటిలోని ఆగ్నేయ గదులను ఉపయోగించకూడదు.
47. ఇంటి నిర్మాణానికి తప్పనిసరిగా చతురస్రం/దీర్ఘచతుర స్రాకార ఆస్తిని మాత్రమే కొనుగోలు చేయాలి.
48. అన్ని గదుల ఫర్నిచర్ నమూనాను, ఏర్పాటు చేసిన విధానాన్ని అప్పుడప్పుడూ మార్చుతూ ఉండాలి.
49. వంటగదిలో నీలం రంగును ఉపయోగించకూడదు.
50. పడకగదిలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేయకూడదు.
51. ఇల్లు/కార్యాలయ ప్రాంతంలో ఎప్పుడూ నిర్మాణం పూర్తి చేయని గోడ ఉండకూడదు.
52. మంచి ఏకాగ్రత కోసం టేబుల్ పై గ్లాసు నిండుగా నీరు ఉంచండి.
53. మంచం ముందు అద్దం ఉండకూడదు.
54. మెయిన్ డోర్ నేరుగా బాత్రూమ్ తలుపుకు ఎదురుగా ఉండకూడదు
55. ఇనుము/లోహపు మంచం మీద ఎప్పుడూ నిద్రపోకూడదు
56. కాక్టస్ వంటి ముళ్ల చెట్లను ఇంట్లో నాట కూడదు
57. T-పాయింట్‌కు ఎదురుగా అంటే వీధి పోటు వచ్చేలా ఇంటి నిర్మాణం చేయకూడదు. అటువంటి ఇళ్లకు అద్దెకు వెళ్ళకూడదు.
58. గరిష్ట సంఖ్య లో కిటికీలు తూర్పు/ఉత్తరం గోడపై ఉండాలి.
59. మెయిన్ డోర్, ఇతర తలుపులు, కిటికీలు తెరు స్తున్న పుడుకానీ, మూసివేస్తున్న పుడు కానీ ఎటువంటి శబ్దాలు చేయకూడదు.
60. వంటగదిలో, వంట గ్యాస్ & వాషింగ్ సింక్ మధ్య వీలైనంత ఎక్కువ దూరం ఉండాలి.
61. బెడ్‌రూమ్‌లలో కర్పూర స్ఫటికాలను క్రమం తప్పకుండా ఉంచాలి
62. మంచి ఫలితాల కోసం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉత్తరం/తూర్పు వైపు చూడాలి.
63. ఇంట్లో పగిలిన గాజు లేదా అద్దం ఉండకూడదు
64. ఎప్పుడూ ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోకండి.
65. ఒక వరుసలో మూడు తలుపులు ఉండకూడదు.
66. బీమ్స్ కింద ఎప్పుడూ కూర్చో వద్దు లేదా నిద్రపో కూడదు
0 కామెంట్‌లు